Ashram School | విద్యార్థి మృతి పై విచారణ…

Ashram School | విద్యార్థి మృతి పై విచారణ…
- ముగ్గురు సస్పెన్షన్.. ఒక రు డిస్మిస్..
- ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
Ashram School | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని మహానంది లో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ విజయ్ కుమార్ మృతి చెందిన ఈనెల 10వ తేదీన సంఘటన జరిగింది. ఈ విషయంపై ఐటీడీఏ పీవో శివప్రసాద్ విచారణ జరిపించారు. ఆ విచారణ మేరకు గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ వార్డెన్ మరో టీచర్ను సస్పెండ్ చేస్తూ, సీఈఆర్టీని విధుల నుంచి తొలగిస్తూ ఐటిడిఏ పిఓ శివప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోస్పాడు మండలం, సాంబవరం గ్రామానికి చెందిన పులి విజయ్ కుమార్(13)మహానంది లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
అయితే ఈ నెల 6వ తేదీన తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాద వశాత్తు కిందపడటంతో ఇనుప కడ్డీలు తలకు కుచ్చు కొని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్సనిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందరు.కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు మహానంది ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించిన గిరిజన ఐటీడీఏ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి సంక్షేమం కోసం అధికారులు పనిచేయాలని ఐటీడీఏ పీవో శివప్రసాద్ సూచించారు.
