Arun l 2వ వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…

Arun l 2వ వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…
ప్రజల సమస్యలే నా ధ్యేయం
ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ అభ్యర్థన
Arun l బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న తరుణంలో 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. వార్డులోని ప్రతి గడపను తడుతూ, ప్రజల ఆశీస్సులు కోరుతూ తనను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో సబ్బని అరుణ్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను హృదయపూర్వకముగా అభ్యర్థించారు. “వార్డులోని ప్రతి సమస్య నాకు తెలుసు. ప్రజా సమస్యల పరిష్కారమే నా ఏకైక ధ్యేయం. నన్ను మీ ఇంటి బిడ్డగా భావించి కౌన్సిలర్‌గా ఎన్నుకుంటే, 2వ వార్డును పట్టణంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాను” అని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నేత సబ్బని కృష్ణ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి సబ్బని అరుణ్ అని, ఆయనను గెలిపించుకుంటే వార్డుకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. యువతరం రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాల్సిన అవసరం ఉందని, అరుణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించి, ‘కారు’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సబ్బని అరుణ్‌కు నీరాజనాలు పట్టారు. ప్రజల నుండి లభిస్తున్న భారీ మద్దతు చూస్తుంటే 2వ వార్డులో అరుణ్ విజయం లాంఛనమేనని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
