ARREST | తాళం వేసిన ఇల్లే టార్గెట్

ARREST | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం ప్రాంతంతో పాటు జిల్లాలోనే పలు ప్రాంతాలలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను(Interstate gang members) బుధవారం అరెస్టు చేయడంతో తోపాటు, వారి నుండి, రూ.40 లక్షలు విలువ చేసే, 309.13, గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, 3010 గ్రాముల వెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ రోజు హిందూపురం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్లో(Upgraded police station) ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేవీ మహేష్, యుపిఎస్ సిఐ యుపిఎస్ఆంజనేయులతో కలిసి ఎస్పీ కేసు వివరాలు తెలియజేశారు. బండికాళ్ళ రత్నరాజు@తేజ, ఎస్.ఎన్ బాబు ప్రసాద్, M.G.గంగరాజు, ఉప్పర సురేష్, సిద్దిక్ సాబ్‌ల‌ను అరెస్టు చేశారు.

Leave a Reply