Arava Sridhar | జనసేన ఎమ్మెల్యేపై…

Arava Sridhar | జనసేన ఎమ్మెల్యేపై…
Arava Sridhar | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీకి చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఆరోపణలు చేసిన మహిళకు వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్‌ను ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

