అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కియోస్క్ మిషన్లు….

అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కియోస్క్ మిషన్లు….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు భక్తుల మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా దేవస్థాన ప్రాంగణం లో కరూర్ వైశ్యా బ్యాంక్ నందిగామ వారి సౌజన్యంతో కియోస్క్ మిషన్లు కార్యనిర్వహనాధికారి బి మహేశ్వరరెడ్డి బ్యాంక్ మేనేజర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది.

ఈ కియోస్క్ మిషన్లు ద్వారా ఆన్లైన్ లో అప్పటికి అప్పుడు ఫోన్ పే గూగుల్ పే ఇతర యుపి ఐ యాప్స్ ద్వారా దర్శనం టికెట్స్, సేవలు బుక్ చేసుకొనుటకు అవకాశం కలదు. భగవంతుని సేవ భక్తునికి మరింత చేరువలో ఉండాలని లక్ష్యం తో ఈ మిషన్లు ఏర్పాటు చేయటం జరిగింది అని. ఈ సౌకర్యమును భక్తులు ఉపయోగించుకొనవలసినదిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ చుంచు రమేష్ బాబు ఆలయ అధికారులు జంగం శ్రీనివాసరావు, డివిఎన్ రాజు ఆలయ సిబ్బంది భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply