భద్రాచలం, ఆంధ్ర‌ప్ర‌భ : భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి రెండో ప్ర‌మాద హెచ్చ‌రికాకు చేరువ‌లో ఉంది. అయితే రేపు మ‌ధ్యాహ్నం నుంచి శాంతించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. గోదావరి నదిలో నీటి మట్టం నిలకడగా సాగుతు శనివారం సాయంత్రం 4 గంటలకు 47.4 అడుగుల వద్ద ఉంది.

మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి ఎగువన ఉండటం వల్ల హెచ్చరిక కొనసాగుతోంది. అయితే 48 అడుగుల‌కు చేరితే రెండో ప్ర‌మాద హెచ్చరికా జారీ చేయాల్సి ఉంటుంది.

పేరూరు వద్ద గోదావ‌రి 16.75 మీటర్ల స్థాయి ఉండటం, మొత్తం దిగువకు వదులుతున్న క్రమంలో ఈ వరద ప్రవాహం పెరిగి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది.

అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేయడం వలన భద్రాచలం వద్ద నీటి మట్టం స్వల్పంగా పెరుగువచ్చు.

Leave a Reply