Applications received | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు త్వరగా న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలు సమస్యలపై అర్జీదారులు కలెక్టర్ కు అర్జీలు అందజేశారు.
పింఛన్ ఇప్పించండి సారూ…
కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామానికి చెందిన బి.ధనుంజయ్ అనే యువకుడికి పెన్షన్ రావడం లేదని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో తన సమస్యను ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ బాలాజీ స్వయంగా దివ్యాంగుని వద్దకు వెళ్లి అర్జీని స్వీకరించారు. సమస్య పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

