ఆంధ్రప్రభ, గాజువాక (విశాఖపట్నం)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలకరింపు.. ఓదార్పు కోసం ఓ దివ్యాంగ వీరాభిమాని తల్లడిల్లిపోతున్నాడు. ఏ రోజు గుండె స్థంభిస్తుందో.. ఏ క్షణంలో ఊపిరి ఆగిపోతుందో.. అర్థం కాని స్థితిలో ఒక్కసారి కానరావయ్యా.. కరుణ చూపయ్యా అని ఈ వీరాభిమాని వేడుకొంటున్న వైనం ఇది. విశాఖ పట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం వడ్లపూడి గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన అప్పలరాజు వేడుకోలు ఇలా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీర అభిమాని నేను. ఒక దివ్యాంగుడిని. ఈ వైకల్యంతో పాటు గుండెలో రిట్రో పలమనరి సిండ్రోమ్ అనే వ్యాధిని వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమస్యతో శరీరంలో పెరుగుతున్న రక్త శాతం పెరుగుతోంది. అది నోటి నుంచి బయటకు వచ్చేస్తోంది. ఆ సమయంలో శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నాను. ఈ సమస్యపై చాలా ఆసుపత్రుల్లో చాలామంది వైద్యలను సంప్రదించగా.. ఎటువంటి శస్త్ర చికిత్స (ఆపరేషన్) లేదు. ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే బతకాలని వైద్యులు తేల్చి చెప్పారు. నేను గుండె ధైర్యంతో ఇంతవరకు జీవనం సాగిస్తున్నాను. ఇదీ అతడి జీవన్మరణ సమస్య.
కన్నీళ్లకే కష్టాలు
ప్రస్తుతం అతడి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తోంది. బతకాలని ఆశ కలుగుతోంది. కానీ ఎంత కాలం బతుకుతాడో నమ్మకం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా, అతడి ఆరోగ్య పరిస్థితి చూసి ఎవ్వరు అవకాశం ఇవ్వటం లేదు. ఈ స్థితిలో తగిన సహాయాన్ని అందించి, మరికొద్ది రోజులు బతికే అవకాశం కల్పించాలని ఆశిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావటంతో.. ఆయన కలవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. పవన్ కళ్యాణ్ ను కలిస్తే తనకు గుండె ధైర్యం పెరుగుతుందని గంపెడాశతో ఈ దివ్యాంగుడు భగీరథ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
Decisions | టిటిడికి కొత్త పరిపాలన భవనం – సామాన్య భక్తులకు మరిన్ని వసతి గృహాలు – పాలకమండలి
తొలిసారిగా గత యేడాది 12 జూలై 2024న తెలంగాణ నుంచి అప్పలరాజు తన స్నేహితుల ద్వారా జనసేన పార్టీ కార్యాలయానికి (మంగళగిరి) ఒక వినతి పత్రాన్ని పంపించారు. ఒక వారం పది రోజుల్లోనే జనసేన కార్యాలయం నుంచి అతడికి ఫోన్ కాల్ వచ్చింది. తొందర్లోనే పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. నాలుగు అయిదు సార్లు కార్యాలయానికి కి ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ స్పందన అంతంతే. యేడాది గడిచిపోయింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి నేరుగా వెళ్లాడు. అక్కడ పరిస్థితులు చూసి, పవన్ కళ్యాణ్ తో కలవటం కుదరదనే భావనతో వెనుతిరిగాడు.
అప్పలరాజు స్నేహితులు వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోని తదితర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలను వీక్షించిన ఎందరో లైక్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కరుణ కటాక్షాలు దక్కలేదని అప్పలరాజు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికైనా తన ఆవేదన ను అర్ధం చేసుకొని తన దైవం పవన్ కళ్యాణ్ కలిసే భాగ్యాన్ని కల్పించి తాను బతికేందుకు భరోసా కల్పించాలని డిప్యూటీ సీఎం పవనన్న వీరాభిమాని అప్పలరాజు వేడుకొంటున్నాడు.