ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీమిండియా (Team India) క్రికెట్ టీమ్ జెర్సీకి కొత్త స్పాన్సర్ అపోలో టైర్స్ (Apollo Tyres) సొంతం చేసుకుంది. 2027 వరకు ఈ స్పాన్సర్‌షిప్ కొనసాగనుంది. ఇటీవల బీసీసీఐ డ్రీమ్ 11 (Dream11)తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్‌కు సంబంధించిన యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రీమ్ 11పై కూడా ప్రభావం పడటంతో టీమిండియా జెర్సీపై స్పాన్సర్‌షిప్ (Sponsorship)ను కోల్పోయింది.
అపోలో టైర్స్ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న నేపథ్యంతో బీసీసీఐ (BCCI)కి ఒక్క మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు ఇవ్వనున్నారు. ఇంతకుముందు డ్రీమ్ 11 ఒక్కో మ్యాచ్‌కు రూ.4 కోట్లు ఇచ్చేది. అపోలో టైర్స్ రూ.50 లక్షలు అదనంగా ఇవ్వనుంది.

