AP | జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

AP | జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాక్స్ విజన్ హాస్పిటల్ సహకారంతో కంటి,సాధారణ పరీక్షలు

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాల రోడ్‌లో ఆదివారం జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో, మాక్స్ విజన్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి, సాధారణ వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు జగ్గా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగ్గా మరణం పార్టీకి తీరనిలోటు అని పేర్కొన్నారు. జగ్గా పేరుతో వారి కుటుంబ సభ్యులు సమాజసేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి వైద్య సలహాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ అధ్యక్షురాలు బుర్రి పావని, 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్, వైఎస్సార్సీపీ నాయకులు బుర్రి బాబు రావు, చరణ్, రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

AP

Leave a Reply