AP | పూర్తిగా దగ్ధం

AP | పూర్తిగా దగ్ధం
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
