రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పై దాడి చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ నేడు(సోమవారం) పాపిరెడ్డిపల్లికి వచ్చారు. అయితే ముందుగా ఆయన కుంటిమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా ఒక్కసారిగా హెలికాఫ్టర్ వైపు దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన సీఐపైనా దాడికి తెగబడ్డారు. అనంతరం హెలికాప్టర్‌పై పడి విండ్ షీల్డ్ పగలకొట్టారు. ఫ్యాన్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పడిపోవడంతో పైలట్ అలర్ట్ అయ్యారు.
వైసీపీ కార్యకర్తల నుంచి కాపాడుకునేందుకు పైలట్ వెంటనే టేక్ ఆఫ్ చేశారు. అక్కడ్నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ రోడ్డుమార్గాన బెంగళూరుకు బయలుదేరారు. తన పార్టీ కార్యకర్తలు చేసిన నిర్వాహం చెప్పుకోలేక హెలీకాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలంటూ జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారు.