AP | ఏపీలో ప్రస్తుత పులుల సంఖ్య ఎంతంటే….

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వన్యప్రాణుల సంరక్షణలో చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) ప్రాంతంలో మొత్తం 87 పులులు, వాటిలో పిల్ల పులులు కూడా ఉన్నాయని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పర్యావరణ పరిరక్షణ చర్యలు ఫలిస్తున్నాయనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇవాళ 87 పులులు ఉండటం ప్రజల భాగస్వామ్యంతో, అటవీశాఖ సిబ్బంది అంకితభావంతో సాధ్యమైంది. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారి మార్గదర్శనం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగతిశీల నాయకత్వం వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు.

అటవీశాఖ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) పులుల సంరక్షణ కోసం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. పులుల సంఖ్య పెరగడం ద్వారా పర్యావరణ వ్యవస్థకు సమతుల్యత కలుగుతోందని, ఇది గ్రామీణ జీవన విధానానికి, ప్రకృతి పునరుత్తానానికి తోడ్పడుతుందని తెలిపారు.

Leave a Reply