డుంబ్రిగుడ: కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటన కొనసాగింది. డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనుల కోరిక మేరకు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ప్రకటించారు.
త్రిశంకు స్వర్గంలో వాలెంటిర్లను పడేసిన జగన్
వాలంటీర్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా చేశారని.. మంత్రి నారా లోకేష్‌తో కేబినెట్‌లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు పవన్. వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు. వాలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో తెలీదని అన్నారు.. వాలంటీర్ నాయకులను జీతాలు ఎలా ఇచ్చారో అడిగి తెలుసుకోవాలని ప్రజలకు తెలిపారు.
సీఎం చంద్రబాబు దృష్టిలో మాత్రమే కాకుండా కేబినెట్ దృష్టిలో పెడతానన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి అని పెట్టారన్నారు. కేబినెట్‌లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడటానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదన్నారు. వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు అని చెప్పి మాయ చేశారని ఇప్పటికే 25 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు.
https://twitter.com/JanaSenaParty/status/1909492341666177146
సీఎస్‌ఆర్ నిధులతో.
గిరిజన ప్రాంతాలలో ఉన్న సికిల్ సెల్ ఏనిమియా వ్యాధి బాధితులకు బ్లడ్ అవసరమని.. సీఎస్‌ఆర్ నిధులతో అయినా ఏర్పాటు చేయాలన్నారు పవన్ . సికిల్ సెల్ ఏనిమియా వ్యాధి డ్రైవ్ చేసి గుర్తించాలని… దీనిని కేబినెట్ దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి అంగన్వాడీలతో పోషక పదార్థాలు అందించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. 2018లో వచ్చినప్పుడు విన్న అన్ని సమస్యలు తన గుర్తు ఉన్నాయని.. కాబట్టే మళ్ళీ వచ్చానని తెలిపారు. సికిల్ సెల్ ఏలేమియా వ్యాధికి సంబంధించి సీఎంకు అవగాహన ఉందన్నారు.
అరకులో 2.50 లక్షల ఎకరాలలో కాఫీ సాగు
అరకు ప్రాంతంలో 2.50 లక్షల ఎకరాల భూమిలో కాఫీ పంట వేస్తున్నామన్నారు పవన్. ఇక్కడ ఉన్న భూములను అందరికి అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నామన్నారు. దింసా డాన్స్ చేసే వాళ్లకు, ఉసిరి, స్టాబేర్రి, లాంటి పంటలు వేసి ఉమ్మడి సాగు చేస్తే జాతీయ ఉపాధి హామీ పధకం నుంచి నిధులు తీసుకువచ్చి డెవలప్ చేస్తామన్నారు. అటవీ శాఖ, మార్కెటింగ్ శాఖ ద్వారా పండించిన పంటలను విశాఖలో మార్కెటింగ్ చేస్తానని తెలిపారు. కురిడి గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుని వాణిజ్య పంటలు పండించాడానికి మార్గాలు వెతుకుతామన్నారు. నరేగా జాతీయ ఉపాధి హామీ పధకం నుండి నిధులు తీసుకువచ్చి పంచాయితీ రాజ్ శాఖ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. సినిమా వాళ్లకు, టీవీ సీరియల్ వారికి అవకాశం ఉండేలా వసతులు ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం శాఖ నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వస్తామని చెప్పారు.
మీ ఇబ్బందులు పరిష్కరిస్తా
కుల ధ్రువీకరణ పత్రాలు కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఈరోజు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు డిప్యూటీ సిఎం . వ్యాసనాలు, గంజాయి వద్దు, గంజాయి కంటే తులసి మొక్క నాటడం మంచిదని సూచించారు. కురిడి గ్రామానికి అధికారులను పంపిస్తానని.. అరకు, పాడేరుకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేయలేమని తెలిపారు. టూరిజంలా గ్రామ దేవతల ఆలయాలను సాంస్కృతిక శాఖతో కలిపి అభివృద్ధి చేయడానికి చూస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతం అందాలు పెరిగేలా చూడాలి తప్ప అందం పోయేలా ఉండకూడదన్నారు. తాను గిరిజనుడిగా పుట్టలేదు కానీ ఆలోచన ఉందన్నారు. కేరళ టూరిజం మోడల్‌ను దృష్టిలో పెట్టుకుని అరకు టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.