విశాఖపట్నం – గ్రేటర్ విశాఖపట్నం మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మేయర్‌గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పిలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇదిలా ఉండగా.. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.
నేడు జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కోరం కంటే ఎక్కువ మంది సభ్యులు హజరయ్యారు. ఇక మేయర్ ఎన్నిక కోసం కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును జనసేన, బీజేపీ, కూటమి కార్పొరేటర్లు బలపరిచారు. పోటీలో ఇంకెవరూ లేనందున మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రకటించారు. పీలా శ్రీనివాసరావు మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నిక ధృవపత్రాన్ని జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఆపై విశాఖ నూతన మేయర్‌గా పీలా శ్రీనివాసరావుతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు.