AP|నేడు తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నిక – భారీగా పోలీస్ లు మోహరింపు
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది.కాగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాకపోవడంతో సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక వాయిదా పడింది.
తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లకుగాను వైసీపీ బలం 27గా ఉండేది. అయితే, వీరిలో పది మంది ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
వైసీపీ ఛలో తుని.. పోలీసులు అలర్ట్తుని
మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న (సోమవారం) వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను టీడీపీ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేడు (మంగళవారం) ఛలో తునికి పిలుపునిస్తున్నట్లు దాడిశెట్టి రాజా తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంత నేతలకు తునిలోకి ప్రవేశం లేదంటూ పోలీసులు ప్రకటించారు.
తునిలో ట్రాఫిక్ ఆంక్షలు
తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల జంక్షన్ నుంచి మున్సిపాలిటీకి వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. స్కూల్ విద్యార్థులకు, సైకిల్ పై వెళ్లేవారు, ద్విచక్ర వాహనాలకు పెద్ద వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ 11 గంటలకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఈ విధంగా ఆంక్షలు పెడుతున్నారు.
గతాన్ని తలుచుకుని భయాందోళన
కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక టీడీపీ-వైసీపీ మధ్య నిప్పు రాజేసింది. ఇరు పార్టీల నేతలు ఎక్కడా తగ్గకపోవడం… వైసీపీ ఛలో తునికి పిలుపునివ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలోనూ కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన నిరసనల్లో రైలును తగలబెట్టడం సంచలనంగా మారింది. ఆనాటి పరిస్థితులను తలచుకుని తుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.