AP | చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి

డుంబ్రిగూడ – చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ కేంద్రంలో చోటు చేసుకుంది. జంగమయ్య ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులో ఈతకు దిగి వీరు మృతి చెందారు.

మృతులను గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్, కోతంగి పంచాయతీ బిల్లాపుట్ గ్రామానికి చెందిన గుంట భానుతేజ, సాయికిరణ్‌గా గుర్తించారు. భానుతేజ, సాయికిరణ్ వారం క్రితమే మేనమామ ఇంటికి వచ్చారు. ఈలోపు స్నేహితుడితో కలిసి సరదాగా చెరువులో ఈతకు దిగి మృతి చెందారు.

Leave a Reply