AP | పోటెత్తిన ఆలయం..

AP | పోటెత్తిన ఆలయం..
AP, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకుని నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
