AP స్వర్ణాంధ్ర కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

చంద్రబాబు ఛైర్మన్ గా ఎనిమిది మందితో కమిటీ
కో ఛైర్మన్ గా టాటా సన్స్ సిఈవో చంద్రశేఖరన్

వెలగపూడి – స్వర్ణాంధ్ర 2047 (Swrnandhra) పారిశ్రామిక అభివృద్ధి సాధన కోసం ఓ టాస్క్​ఫోర్స్​ను (Taskforce) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్​ఫోర్స్ ను ఏర్పాటు చేశారు . కో చైర్​పర్సన్​గా టాటా సన్స్ సిీఈవో ​చంద్రశేఖరన్ (Chandra Sekharan) ​వ్యవహరించనున్నారు. టాస్క్​ఫోర్స్​సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్​బెనర్జీ, అపోలో ఆస్పత్రి వైస్​ చైర్​పర్సన్ ​ప్రీతారెడ్డి (Preetha reddy, , సుచిత్ర ఎల్లా (Suchitra Ella) , ప్రొఫెసర్​ రాజ్​రెడ్డి, సతీష్​రెడ్డి, జీఎం రావు , ఎల్​ఎండ్ టీ చైర్మన్​సుబ్రహ్మణ్యన్​, ఏపీ సీఎస్​విజయానంద్​ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి బ్లూప్రింట్​తయారు చేసేలా ఈ టాస్క్​ఫోర్స్​పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్​ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చూస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Leave a Reply