AP | ప్రతిపక్ష నాయకుడిగా జ‌గ‌న్ ను గుర్తించడం కుదరదు .. స్పీకర్ రూలింగ్

వెల‌గ‌పూడి , ఆంధ్ర‌ప్ర‌భ – ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిని గుర్తించడం కుదరదని, ప్రజలు జగన్‌కు ఇవ్వని వరాన్ని పూజారిగా తాను నెరవేర్చలేనని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడం అంశంపై ఏపీ అసెంబ్లీలో నేడు స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. జగన్‌ కోరికను నెరవేర్చడం జరగదని స్పష్టం చేశారు. జగన్‌ సభకు హాజరు కావాల్సిందేనని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని హైకోర్టులో జగన్‌ వేసిన పిటిషన్‌ విచారణకు అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

స‌భా సంప్ర‌దాయాల‌కు అనుగుణంగానే స‌భ ఏర్పాటు

2024 జూన్ 21న శాసన సభా సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేశారు. జూన్‌ 24న జగన్‌ స్పీకర్‌‌కు రాసిన లేఖలో అవాస్తవాలు, బెదిరింపులతో పాటు తనకు ప్రతపక్ష నాయకుడి హోదా ఉందంటూ పేర్కొన్నారని సభకు వివరించారు., ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించగలిగే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుందనే వాదన సరికాదని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఇక జూన్ 26వరకు జగన్ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్సీపీ శాసన సభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు సచివాలయానికి తెల‌పలేదన్నారు. జూన్‌ 26కంటే ముందు, స్పీకర్‌ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి గురించి నిర్ణయం తీసుకోవడం ఎలా సాధ్యపడుతుందని అయ్యన్న ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం అనేది, రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాలు మేరకు నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్‌ వేతనాలు, పెన్షన్ చెల్లింపుల చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన ఉంది.,సెక్షన్ 12 బి ప్రకారం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే చట్టసభలో ప్రాతినిథ్యంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలని అయ్యన్న వివరించారు.,ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలి. సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. అత్యధిక సంఖ్యా బలం ఉన్న పార్టీలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే సభాపతి నిర్ణయం తీసుకోవచ్చు. కనీసం 10శాతం స్థానాలు గెలిచి ఉండాలన్నారు.

2019 జనవరి 20న పొరుగు రాష్ట్రంలో ఓ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చార‌ని, అదే ఏడాది జూన్ 6న ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10శాతం కంటే తగ్గడంలో సభాపతి ప్రతిపక్ష గుర్తింపు ఉపసంహరించుకున్నారని స్పీక‌ర్ గుర్తు చేశారు..,10శాతం సంఖ్యాబలం లేకున్నా8వ లోక్‌సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించిందని చెప్పడం సరికాదని, టీడీపీ గ్రూపు నాయకుడిగా మాత్రమే గుర్తించారని స్పీకర్‌ అయ్యన్న వివరణ ఇచ్చారు.,ఏపీ అసెంబ్లీలో కనీసం 18 స్థానాల్లో ప్రాతినిథ్యం ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు గురించి జగన్‌ కు తెలుసని 2019లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రసంగిస్తూ, చంద్రబాబుకు 23మంది శాసనసభ్యులు ఉన్నారని, ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సభలో మాట్లాడారని స్పీకర్‌ గుర్తు చేశారు.,

దేవుడే తిర‌స్క‌రించాడు…

దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం సరికాదని, ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్‌ ఇవ్వలేడని, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలనే కోరికను పరిశీలించడం సాధ్యం కాదన్నారు.,సభకు దూరంగా ఉంటే నియోజక వర్గ సమస్యలను సభలో ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని , బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. నిరాధారమైన ఊహాగానాలతో సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తెర దించేందుకు ఈ మేరకు రూలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు.

ప్ర‌జ‌లే హోదాల‌ను నిర్ణ‌యిస్తారు…

అలాగే జగన్‌కు ప్రతిపక్ష హోదాకు సంబంధించి స్పీకర్‌పై సాక్షి పత్రికలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ స్పందిస్తూ.. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే అని తెలిపారు. సాక్షి పత్రికలో స్పీకర్ పై తప్పుడురాతలు బాధాకరమన్నారు. చట్ట సభలు చూస్తూ పెరిగినవాడినని, చిన్నవయసులో చట్టసభలను చూశానని తెలిపారు. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావని.. ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని చెప్పారు. చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని.. తొలిసారి శాసనసభకు వచ్చినట్లు తెలిపారు. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చేయకుండా గవర్నర్ స్పీచ్‌ను డిస్ట్రబ్ చేసి వెళ్లారన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిల వద్దే ఉండి ధర్నా చేశామని.. పోడియం వద్దకు రాలేదని.. తాము ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్‌ని అని.. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్‌లో కూడా ఈ విషయం పొందుపర్చబడి ఉందన్నారు.

ఇది కరెక్ట్ కాదు…

జగన్ మోహన్ రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ… చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని.. ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదని సభ సాక్షిగా వ్యాఖ్యానించారని తెలిపారు. స్పీకర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువును తగ్గిస్తుందని… సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని.. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. జగన్‌మోన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ పాయింట్స్ అని సెక్యూరిటీ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్‌పైన రుద్దడం బాధాకరమని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని.. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *