నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా సౌర వెలుగుల ప్రాజెక్టుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో వెలుగులు వీరాజీల్లుతున్నాయని ఇందులో భాగంగా జిల్లాలోని ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న ఆరు నెలల లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర కేంద్ర ఆహార పౌరసరపరాలు శుద్ధ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
శుక్రవారం నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ అహోబిలం క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడరు…. సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు ఈ ప్రాంతానికే కాకుండా రాష్ట్రానికి దేశానికి ఓ గర్వకారణమైన ప్రాజెక్టు అని ఇది ప్రాంత ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రాజెక్టును త్వరలోనే నిర్మాణం పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేయటం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.