సదుం (ఆంధ్రప్రభ) : సదుం తాసిల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు దాడులునిర్వహించారు. కార్యాలయం ఎదుటే లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకున్నారు.
ఏసీబీ ఎస్పి ఎస్.వి.ప్రశాంతి అందించిన వివరాల మేరకు
షఫీ ఉల్లా అనే రైతు ఐదు ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని సెటిల్మెంట్ ల్యాండ్ ని అసైన్‌మెంట్‌గా రిజిస్టర్ చేయడానికి రెవెన్యూ అధికారులు రూ.150,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత షఫీ ఉల్లా MROతో రూ.75,000 కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన భూమికి ఇంత మొత్తాన్ని లంచంగా ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
శనివారం, ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో రైతు షఫీ ఉల్లా నుండి లంచం తీసుకుంటుండగా వీఆర్వో మహబూబ్ బాషాను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అతనిపై తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఎస్పి ఎస్.వి.ప్రశాంతి తెలిపారు.