AP | సీమకు వాన వార్నింగ్ !

- బంగాళఖాతంలో మరో అల్పపీడనం
తిరుపతి,ఆంధ్రప్రభబ్యూరో(రాయలసీమ) : రాబోయే రెండు మూడురోజుల్లో రాయలసీమ (rayalaseema) ప్రాంతంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (weather worning) శనివారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరప్రాంతంలో (Srilanka seashore) ఏర్పడే అల్పపీడనానికి అనుబంధంగా (Dipression) ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని ఆ శాఖ స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం (నవంబర్ 17 వ తేదీ) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే మంగళవారం (నవంబర్ 18 వ తేదీ) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో ( storm rains) కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (moderate rains) కురిసే అవకాశం ఉందన్నారు.
అంతేకాక నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది
