AP | జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
( విజయవాడ ఆంధ్రప్రభ ) : హైదరాబాద్‌లో జనవరి 28 నుంచి 30 వరకు జాతీయ స్థాయి క్యాడెట్ (14 ఏళ్లలోపు), సీనియర్ కేటగిరీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 16 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఏపీ నుంచి 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం 46 పథకాలు సాధించారు. వీటిలో 19 బంగారు పథకాలు, 16 వెండి పథకాలు, 11 కాంస్య పథకాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా అంకమ్మరావు తైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు, పథకాలు గెలుపొందిన క్రీడాకారులతో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరిన్ని పథకాలు సాధించి ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు పథకాలు గెలుపొందే విధంగా శిక్షణ ఇచ్చిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావుని ప్రత్యేకంగా అభినందించినారు.