AP| అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు – పార్టీ ఎంఎల్ఏ లకు దిశ నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి – బడ్జెట్ సమావేశాల వ్యవహారశైలిపై తన పార్టీ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ఈరోజు మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో ఎంఎల్ఏ లు, మంత్రులు, శాసన మండలి సభ్యులు సభల్లో వ్యవహరించాల్సిన విధానం, మాట్లాడాల్సిన అంశాలపై చర్చించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో, శాసన సభ ప్రతిష్ట పెంచేలా సమావేశాలు జరగాలని, ప్రతీ సభ్యుడు, సభ్యురాలు సమావేశాల్లో విధిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు