AP | ఇకపై అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అమరావతి : : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం… అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఈ వేడుకలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ సర్కార్ చీఫ్ సెక్రటరీ విజయానంద్.. సచివాలయంలోని అన్ని విభాగాలు, అన్ని విభాగాధిపతులు, రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది ప్రభుత్వం..

ఓవైపు కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోంది.. ఈ పసుపు పండగ వేదికగా ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు జరగనున్నాయి..

Leave a Reply