AP | నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీ !

  • 35 మార్కెట్ కమిటీల్లో మహిళలకు అవకాశం
  • ప్రభుత్వం జారీ చేసిన GO

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ కూటమి నేతలకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వం అధికారికంగా జీవో (GO)ను విడుదల చేసింది.

జారీ చేసిన జీవో ప్రకారం,

ఈ 66 చైర్మన్ పదవుల్లో 17 బీసీలకు, 10 ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీ నేతలకు అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా 35 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మహిళలకు కేటాయించడమే ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 9 పదవులు జనసేనకు, 4 బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది.

Leave a Reply