వెలగపూడి – జనసేన ఎమ్మెల్సీగా బాద్యతలు స్వీకరించిన నటుడు నాగబాబు నేడు జనసేన అధినేత,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తో నేడు భేటి అయ్యారు.. విజయవాడలోని డిప్యూటీ సిఎం నివాసానికి వెళ్లిన నాగబాబు సోదరుడు పవన్ కు పుష్ప గుచ్చాన్ని అందజేశారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు జనసేనాని శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు..
చిరంజీవి ఆశీస్సులు..
కాగా, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగా బాబు హైదరాబాద్ లోని తన అన్నయ్య చిరంజీవి నివాసానికి వచ్చారు.. అన్నయ్య , వదినకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.. ఈ సందర్బంగా నాగబాబుకు చిరంజీవి పూల మాల వేసి సత్కరించారు..
