AP | ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యయత్నం..

వెల్దుర్తి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్ కొట్టాల గ్రామంలో పేడరంగు తాగి తన ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి సుభాషిణి మృతి చెంద‌గా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎల్ కొట్టాల గ్రామానికి చెందిన‌ వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతులకు ఇద్దరు మాన్యశ్రీ (10) మరియు విలక్షన్ (7) కుమార్తెలు. వెంకటేశ్వర్లు వెల్దుర్తిలో బిసి పాయింట్ నడుపుతున్నారు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుభాషిణి తనతో పాటు తన ఇద్దరు పిల్లలను రసాయన ద్రావణం తాగించింది.

గమనించిన స్థానికులు వారిని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి మృతి చెందగా, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply