MINISTER NARAYANA : అధైర్యం వ‌ద్దు Andhra Prabha News

MINISTER NARAYANA : అధైర్యం వ‌ద్దు Andhra Prabha News

  • అంద‌రినీ ఆదుకుంటాం
  • అతిసార బాధితుల‌కు మంత్రి నారాయ‌ణ భ‌రోసా

( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో):

డయేరియా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. డయేరియా ప్రబలిన దమ్మలవీధి, కండ్రవీధిలోని బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ లతో కలిసి మునిసిపల్ మంత్రి బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా యేరియా తో మృతి చెందిన మండల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.

డయేరియాతో బాధపడుతున్న దమ్మలవీధి,గోల్కొండ వీదికి చెందిన కెల్లి రమణమ్మ ను పరామర్శించారు. వాంతులుడ యేరియా తగ్గినట్లు రమణమ్మ చెప్పారు. . వేడి చేసిన నీటిని మాత్రమే త్రాగాలని మంత్రి సూచించారు. ఎలాంటి బయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. అనిత, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply