AP | మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు – కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

మంగ‌ళ‌గిరి – అమ‌రావ‌తి (Amaravati) మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకు (Komminenei Srinivasarao) కోర్టు రిమాండ్ విధించింది.. . ఈ కేసులో ఏ1గా జ‌ర్నలిస్ట్ కృష్ణం రాజు (Krishnam Raju), ఏ2గా కొమ్మినేని శ్రీనివాస్ రావు, ఏ3గా టివి ఛాన‌ల్ యాజమాన్యాన్ని చేర్చారు. కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు నిన్న సోమవారం హైదరాబాద్‌లో ఏ2 కొమ్మినేని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సాయంత్రానికి గుంటూరుకు (Guntur) తీసుకొచ్చారు.

ఇక నేటి ఉదయం గుంటూరు జీజీహెచ్‌‌లో(GGH) శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన న్యాయ‌మూర్తి ఇరువాద‌న‌లు విన్న అనంత‌రం 14 రోజుల రిమాండ్ (Remand ) కు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో అయ‌న‌ను జిల్లా జైలుకు త‌ర‌లించారు..

Leave a Reply