AP – పోసాని భార్య‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ …

హైద‌రాబాద్ | సినీ న‌టుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు.. ఆయ‌న‌ను అక్రమంగా అరెస్టు చేశార‌ని ఆరోపిస్తూ టీడీపీ సర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. కాగా నేటి ఉద‌యం జ‌గ‌న్ హైద‌రాబాద్ లో ఉన్న పోసాని సతీమణి కుసుమలతను ఫోన్‌లో పరామర్శించారు. అధైర్య‌ప‌డొద్ద‌ని , తాము అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

పోసాని ఆరెస్ట్ ఇలా

ఇది ఇలా ఉండగా పోసాని కృష్ణమురళిని నిన్న అర్ధరాత్రి పోలీసులు హైద‌రాబాద్ లోని ఆయ‌న ఇంటిలోనే అరెస్టు చేశారు. అనంత‌రం అక్క‌డి నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు తరలించారు. అయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం రాజాంపేట కోర్టులో ప్ర‌వేశపెట్ట‌నున్నారు..

ఇది ఇలా ఉంటే తమ నాయకుడు పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని అనుచితంగా మాట్లాడుతుంటే స‌హించ లేక రెండేళ్ల కిత్ర‌మే ఓబులాపురం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశామ‌ని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి వెల్ల‌డించారు.. ఆ ఫిర్యాదు ఆధారంగానే క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద నోటీసు జారీ చేసి పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *