వెలగపూడి | నేడు విడుదలపై ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్ధుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. . ఈ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది..
మే 12 నుంచి పరీక్షలు…
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జరుగనుంది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని అధికారులు కోరుతున్నారు.