అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సృజన నిన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసింది. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉందని కుటుంబీకులు చెబుతున్నారు.. కాగా నేటి ఉదయం ఆమె తండ్రి ఒక వేడుకకు వెళ్లి ఇంటికి తిరిగివ వచ్చారు.. ఆ సమయంలోనే సృజన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.. వెంటనే ఆమెను కిందకు దించి హాస్పిటల్ కు తరలించారు.. అయితే ఆమె అప్పటికే మరణించింది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ రాయవరం పోలీసులు.
AP అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
