AP | భారీగా మద్యం సీసాలు స్వాధీనం
- అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వైనం
ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా… అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడ్డ సరుకు విలువ రూ.1,95, 600 గా గుర్తించినట్లు తెలిపారు.