AP | జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ – మరో ఆరు నెలల్లో ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి

తుగ్గలి ఫిబ్రవరి 17 (ఆంధ్రప్రభ) కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి సమీపం లో జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ 300 కోట్ల తో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ నిర్మాణ పనులు చేపడుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమన్ ప్రసాద్, డైరెక్టర్లు జెడ్ డెవెని, మానస రంజిత్ లు పేర్కొన్నారు. సోమవారం జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతము రూ 300 కోట్ల తో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ పనులు జరుగుతున్నాయన్నారు.

గోల్డ్ మైనింగ్ కోసం రైతుల నుండి 260 ఎకరాల భూములు కొనుగోలు చేయడం జరిగిందని, అలాగే 1250 ఎకరాల భూములను రైతుల నుండి లీజు కు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతము 150 మంది ప్రత్యక్షంగా గోల్డ్ మైనింగ్ లో ఉపాధి పొందుతున్నారని, మైనింగ్ పనులు పూర్తయిన తర్వాత ఇంకా 200 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారని వారు తెలిపారు.

ఈ పనులు 6 నెలల లోపల పూర్తవుతాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి అయి ప్రారంభమైతే సంవత్సరానికి 750 కేజీల బంగారును ఉత్పత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతము జొన్నగిరి, పగిడి రాయి గ్రామాలలో తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పారిశుధ్యం, తాగునీటి సమస్య ల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *