( ఆంధ్రప్రభ, అమరావతి) : బహుజన్ సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమయ్యజిల్లా మదనపల్లెకు చెందిన బందెల గౌతమ్‌కుమార్‌ను బీఎస్పీ అధిష్ఠానం నియమించింది. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన బందెల గౌతమ్‌కుమార్, ప్రజాసంఘాల నాయకుడు నుంచి అంచెలంచెలుగా జాతీయపార్టీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. బెహన్ మాయావతి ప్రధాన మంత్రి కావాలి అన్న లక్ష్యమే గౌతమ్ ను రాష్ట్ర అధ్యక్షులు గా చేసింది. బందెల గౌతమ్‌కుమార్ బీఎస్సీ, ఎంబీఏ చదివారు. 17 ఏళ్ల వయస్సులో విద్యార్థిసంఘ నాయకుడిగా పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత భారతీయ అంబేద్కర్ సేన(బాస్) వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం.శివప్రసాద్, అనుచరుడిగా పనిచేస్తూ, ఆ సంస్థలో ఉమ్మడి చిత్తూరుజిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో అంబేద్కర్ యువసేనను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రజా, ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. 2017 సెప్టెంబర్ 17న మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, బెహన్.మాయావతి భావజాలంతో పనిచేస్తున్న… బహుజన్‌సమాజ్‌పార్టీ పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు ఆకర్షితుడై కార్యకర్తగా చేరారు. 2019 జూన్‌లో బీఎస్పీ రాష్ట్ర కోశాధికారిగా, సెప్టెంబర్ 17 తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
AP | బీఎస్పీ ఏపీ అధ్యక్షుడిగా బందెల గౌతమ్‌కుమార్
