విశాఖపట్నం – ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు. ఆయనకు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50 శాతం పైగా ఓట్లు రావడం తో ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
తొలి ప్రాధాన్యత లెక్కింపు లోపీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు 7,272 ఓట్లు రాగా.. కూటమి అభ్యర్థి రఘువర్మకు దాదాపు 6,900, విజయగౌరికి 5,900 ఓట్లు వచ్చాయి.ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. 2.3శాతం ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. ఈ స్థానానికి మ్యాజిక్ నంబర్ 10,068 ఓట్లుగా నిర్ణయించారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 10మంది బరిలో ఉండగా.. ఏడుగురి ఎలిమినేషన్ పూర్తయింది. పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి కావడం తో విజేతను ప్రకటించారు.
.