శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ):ఇద్దరు పిల్లలతో సహా భార్య భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం గాంధీ బజార్ లో చోటుచేసుకుంది. పిల్లపాపల తో పండుగ రోజున ఇంటిల్లి పాది పండుగ చేసుకునే సందర్భంలో… ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చిందో కానీ ఉగాది పండుగ రోజు ఆత్మహత్య చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని గాంధీ బజార్ లో నివసిస్తున్న ఆచారి కుటుంబం వారి స్వగృహంలోనే భార్య భర్త లు ఇద్దరు ఇద్దరు మగ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.