- 6వ ఎస్ఐపీబీ సమావేశం
- వేల కోట్ల పెట్టుబడులు..లక్షల్లో ఉద్యోగాలు
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా, 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
తాజాగా ఈరోజు (గురువారం) సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి రూ.33 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.
ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు… శంకుస్థాపన నుండి ప్రారంభోత్సవం వరకు అధికారులు ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం అనుసరించాలని.. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్ర స్థాయి పనుల స్థితిని తెలుసుకోవడానికి ఒక డాష్‌బోర్డ్‌ను తీసుకురావాలని సూచించారు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో ఒక పోర్టల్‌ను తీసుకురావాలన్నారు.
ఎస్ఐపిబి సమావేశాలలో కొత్త పెట్టుబడులను ఆమోదించాలని, ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రస్ వివరించాలి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
6వ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన పెట్టుబడుల వివరాలు
సంస్థలు–పెట్టుబడులు–ఉద్యోగాలు
1) డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : కుమరవరం, అనకాపల్లి జిల్లా – రూ.1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు.
2) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ : పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా – రూ.1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు
3) పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : ఓర్వకల్, కర్నూలు జిల్లా – రూ.1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు
4) బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా – రూ.2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు
5) జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా – రూ.2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు
6) రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా – రూ.228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు
7) మోహన్ స్పింటెక్స్ : మాలవల్లి, కృష్ణా జిల్లా – రూ.482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు
8) ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ : అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా – రూ.1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు
9) వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా – రూ.1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు
10) అలీప్ కుప్పం : చిత్తూరు జిల్లా – రూ.5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు
11) నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : ఏలూరు జిల్లా – రూ.150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు
12) దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు
13) ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : కడప జిల్లా – రూ.3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు
14) బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు
15) బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్ పి: తిరుపతి – రూ.150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు
16) స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి – రూ.327 కోట్ల పెట్టుబడులు, 570 ఉద్యోగాలు
17) వరుణ్ హాస్పటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ : విశాఖపట్నం – రూ.899 కోట్ల పెట్టుబడులు, 1,300 ఉద్యోగాలు
18) డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ.2,475 కోట్ల పెట్టుబడులు, 5,150 ఉద్యోగాలు
19) సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : కర్నూలు జిల్లా – రూ.1,057 కోట్ల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు.