AP CM | రాజేంద్రప్రసాద్ కు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు

AP CM | రాజేంద్రప్రసాద్ కు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు
AP CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీనియర్ సినీనటుడు రాజేంద్రప్రసాద్ కు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో గౌరవపూర్వకంగా కలిశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని, వైవిధ్యమైన పాత్రలను గుర్తిస్తూ రాజేంద్రప్రసాద్‌ను చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఈ భేటీలో రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు మురళీమోహన్ కూడా పాల్గొన్నారు.
పద్మశ్రీ అవార్డు రావడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్‌ను సీఎం సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు రావడం తన వ్యక్తిగత విజయం కంటే తెలుగు సినిమా రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
