వెలగపూడి, ఆంధ్రప్రభ – ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వివిధ పథకాల లబ్దిదారులకు ఆయా పథకాలు అందేలే అధికారులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
ఎపి సచివాలయంలో నేడు ఆయన రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమల్లో లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ, పలు సూచనలు చేశారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని అధికారులను అదేశించారు. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిదని…దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. ఈ రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
AP | కరెప్షన్ అనేది ఒక జబ్బు… దాన్ని అంతం చేయాల్సిందే – చంద్రబాబు
