AP | తిరుపతిలో సీఎం చంద్రబాబు .. ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం ..
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అంతకు ముందు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్రప్రసాద్ అర్లేకర్ సైతం పాల్గొననున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.