AP | నంద్యాల జిల్లాలో దారుణ హత్య..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలోని పాణ్యం శివార్లలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పరుచూరి అశోక్ చౌదరి అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అశోక్ చౌదరి మృతదేహంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఈ దారుణ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానిస్తున్నారు. నంద్యాల డీఎస్పీ మంద జావలి ఆల్ ఫోన్స్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply