ఇచ్ఛాపురం, పాఠశాల విద్యార్థుల ను తరలిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. పురుషోత్తపురం నుండి హెబ్రోన్ స్కూల్ కి విద్యార్థులను ఆటోలో తరలిస్తున్నారు.
పాఠశాల సమీపంలో వచ్చేసరికి లారీ ని పక్క నుండి దాటి వెళ్లే క్రమంలో ఆటో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్నారులు చికిత్సలు పొందుతున్నారు. తల్లిదండ్రుల హాహాకారాలు మిన్నంటాయి.