AP | సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం…

AP | సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం…
- రిపబ్లిక్ డే వేడుకల్లో భరతనాట్యంతో అలరించిన శ్రీకాంత్ బృందం.
- సిక్కోలు కీర్తి చాటేలా మంచి ప్రదర్శన.. కేంద్ర మంత్రి కితాబు .
AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ రాజధాని డిల్లీలోని కర్తవ్యపద్ లో నిన్న జరిగిన 77వ రిపబ్లిక్ డే వేడుకలల్లో సాంస్కృతిక ప్రదర్శన చేసిన శ్రీకాకుళానికి చెందిన రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో భేటి అయ్యారు. డిల్లి అక్బర్ రోడ్డులోని తన నివాసానికి విచ్చేసిన ఈ సిక్కోలు బృందానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. రిపబ్లిక్ డే వేడుకలలో శ్రీకాకుళం కీర్తి చాటేలా మంచి ప్రదర్శన ఇచ్చారని కేంద్రమంత్రి కితాబిచ్చారు. తన తరపున పూర్తి ప్రోత్సాహం ఉంటుందని.. భవిష్యత్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మరిన్ని వేదికలపై మంచి ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. రిప్లబిక్ డే వేడుకల లాంటి ఉన్నతమైన వేదికలో తమ ప్రదర్శనకు అవకాశం లభించేలా పూర్తి తోడ్పాటు అందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు.. నృత్య శిక్షకుడు రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
