AP | రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు..

AP | రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు..
- అమ్మ దయతో ఏపీలో అభివృద్ధి పరుగులు…
- విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాద్..
- కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
- కృష్ణ పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు ఏర్పాటు
AP | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : రానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని, రాష్ట్రాభివృద్ధి పై ఆ జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు వుండాలని ప్రార్ధించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం లో అమ్మవారిని మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ తన తల్లి ప్రసునాంబ, భార్య జానకి లక్ష్మీతో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో వేద పండితులు, ఆలయ అధికారులు, ఆలయ బోర్డ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఎంపి కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. రాబోయే కృష్ణ పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరతాయన్నారు.
ఇంద్రకీలాద్రి ఆలయం మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా వుండటంతో పాటు అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం బోర్డు మెంబర్స్ బాడేటి ధర్మారావు, సుఖాసి సరిత, మన్నె కళావతి, ఠాగూర్ పద్మావతి, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్ బాబు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.వి.వి వెంకట రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ కే.శ్రీనివాసరావు (చందు) లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
