AP | చాపర్ రైడ్ ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు…

AP | చాపర్ రైడ్ ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు…

  • ఛాపర్ పైలట్లను సన్మానించిన రామ్మోహన్ నాయుడు

AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : హెలికాప్టర్ రైడింగ్ అరసవల్లి ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న అరసవల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని హెలికాప్టర్ రైడింగ్ ను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏడు రోజుల పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులను ఈ హెలి టూరిజం కొత్త అనుభూతులను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు హెలి రెడ్లు జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నగరంలోని ఆర్ అండ్ బి బంగ్లా లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఛాపర్ సిబ్బందితో మాట్లాడారు. మంచి అనుభూతులను స్థానికులకు మిగిల్చారని.. విరామం లేకుండా వినోదాన్ని అందించారని పైలట్లను అభినందించారు. హెలి టూరిజం పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఛాపర్ సిబ్బందిని సత్కరించారు. జ్ఞాపకానికి గుర్తుగా వారితో ఫోటో తీయించుకున్నారు.

Leave a Reply