AP | ఇద్దరు యువకులు సజీవదహనం

AP | ఇద్దరు యువకులు సజీవదహనం

AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. గ్రామంలోని మేకల గణేశ్‌ (18), తలపల రమేశ్‌ (18) బైక్‌పై వెళ్తుండగా కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగను తాకారు. ఈ ఘటనలో యువకులిద్దరూ సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply