ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సమాజంలో సమానత్వం, విద్యా, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మండల టిడిపి కన్వీనర్ విజయ భాస్కర్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని శనివారం ఉరవకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండు శతాబ్దాల క్రితమే పూలే సమానత్వం, విద్య కోసం పోరాడారని, ఆయన ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు.

ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవానంద, మాజీ ఎంపీపీ కుళ్లాయప్ప, కండక్టర్ తిమ్మప్ప, రాంప్రసాద్ మాజీ సర్పంచ్ మోపిడి గోవిందు, నిరంజన్ గౌడ్, రాంబాబు, మహమ్మద్ రఫీ, రామాంజనేయులు, రాజేష్, అనిల్, సుదర్శన్, రామకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి ని పురస్కరించుకుని శనివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు కౌకుంట్ల రవి, ఎంఈవో ఎర్రి స్వామి, ఏవో భాస్కర్, దుర్గాప్రసాద్, చెన్నప్ప, రామకృష్ణ, గంగాధర్, వరప్రసాద్, ఓబన్న, రామాంజనేయులు, ఎర్రి స్వామి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శులు మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply